![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -656 లో.....జ్యోత్స్నకి పెళ్లి చెయ్యడానికి తన జాతకం చూపించడానికి పంతులు గారిని ఇంటికి రప్పిస్తాడు కార్తీక్. దీప వెళ్లి జ్యోత్స్నని కిందకి తీసుకొని వస్తుంది. పంతులు గారు జాతకం చూసి.. ఈ అమ్మాయి జాతకంలో పెళ్లి ఎప్పుడో అయినట్లు ఉంది అనగానే అందరు షాక్ అవుతారు. దాంతో అయ్యో ఆ జాతకం నాదండి అని పారిజాతం తీసుకొని జ్యోత్స్న జాతకం ఇస్తుంది అది చూసి ఈ అమ్మాయికి నెల రోజుల్లో పెళ్లి అవుతుందని పంతులు చెప్పగానే అయ్యో మేం ఇంకా సంబంధాలు కూడా చూడలేదని శివన్నారాయణ అంటాడు. నెల రోజుల్లో పెళ్లి అవుతుంది.. లేదంటే అసలు ఈ జన్మలో పెళ్లి కాదని పంతులు చెప్తాడు.
ఆ తర్వాత ఒకసారి మా బావ జాతకం చూడమని దీప అంటుంది. కార్తీక్ జాతకం చూసి గొప్పింటిని వదిలి పేదింటికి వచ్చాడు. అతను పెళ్లి చేసుకున్న భార్య మహారాణి అని పంతులు చెప్తాడు. అవును అది మహారాణే అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత పంతులు వెళ్ళాక జ్యోత్స్నకి మంచి అబ్బాయి వెతుక్కుంటూ వస్తాడని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్, దీప ఇంటికి వెళతారు. అంత నొప్పితో ఆ ఇంటికి వెళ్లడం అవసరమా.. ఒకటి చెప్పురా అసలు జ్యోత్స్న నీ వెనకాల ఎందుకు పడుతుంది.. మీరు ఎందుకు ఆ ఇంటికి వెళ్తున్నారని కాంచన అడుగుతుంది. తన వల్ల రెండు కుటుంబాలు విడిపోయాయని దీప అనుకుంటుంది. రెండు కుటుంబాలు కలపాలని ట్రై చేస్తోందని కార్తీక్ అంటాడు.
మరొకవైపు జ్యోత్స్నకి తన ఫ్రెండ్ కాల్ చేసి తన కూతురు పుట్టినరోజుకి రమ్మని చెప్తుంది. కరెక్ట్ టైమ్ కి పెళ్లి చేసుకొని ఉంటే నువ్వు కూడా పిలిచేదానివి అని తన ఫ్రెండ్ అంటుంది. పిలుస్తా నెల రోజుల్లో పెళ్లి అని జ్యోత్స్న అంటుంది. ఎవరితో అని తన ఫ్రెండ్ అనగానే మా బావతో అని జ్యోత్స్న అనబోతుంటే పారిజాతం వస్తుంది. దాంతో ఆగిపోయి సరే బర్త్ డే కి వస్తానని కాల్ కట్ చేస్తుంది. ఏంటి గ్రానీ ఇలా వెంటపడుతున్నావని పారిజాతంపై జ్యోత్స్న కోప్పడి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కార్తీక్, దీప మాట్లాడుకుంటుంటే మీ చెల్లి అని జ్యోత్స్నని ఉద్దేశ్యంచి కార్తీక్ అంటాడు. ఏంటి నాకు సవతిని చేస్తున్నావని దీప కోప్పడుతుంది. అప్పుడే పారిజాతం ఫోన్ చేసీ జ్యోత్స్నకి నెల రోజుల్లో పెళ్లి చేయకపోతే నిజంగానే నీకు సవతి అయ్యేలా ఉందని పారిజాతం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |